మత్తు పదార్థాల నియంత్రణకు విస్తృత తనిఖీలు..
గట్టుప్పల, ఆంధ్రప్రభ : జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు గురువారం మండల వ్యాప్తంగా మత్తు పదార్థాల విక్రయాలు,వినియోగాన్ని అరికట్టేందుకు ఎస్ఐ సంజీవరెడ్డి పోలీస్ సిబ్బంది మరియు డాగ్ స్క్వాడ్ బృందంతో కలిసి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మండలంలోని మెడికల్ షాపులు,కిరాణా దుకాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు.షాపుల్లో గంజాయి,మత్తు పదార్థాలు, అనుమతి లేని మందులు విక్రయిస్తున్నారా అనే అంశాలపై తనిఖీలు నిర్వహించారు. దుకాణదారులు మత్తు పదార్థాల విక్రయం చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు,కానిస్టేబుల్ స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.
