COLLECTOR | ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలి

  • జేసీ రాహుల్ కుమార్ రెడ్డి

COLLECTOR | భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటిస్తే సామూహిక శుభ్రత సాధ్యమవుతుందని పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతీనెల మూడవ శనివారం ఒక ప్రత్యేక ఇతివృత్తంతో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమములో భాగంగా భీమవరం పురపాలక సంఘం పరిధిలోని ఝాన్సీ లక్ష్మీబాయి మున్సిపల్ బాలికల హైస్కూల్‌లో పురపాలక సంఘ కమిషనర్, మునిసిపల్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో వ్యక్తిగత సామూహిక పరిశుభ్రత” ఇతివ్రతంగా స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర‌ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథి హాజరై మాట్లాడుతూ సామూహికంగా పాటించవలసిన శుభ్రత కార్యక్రమాలను, పాటించవలసిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన అవగాహన స్టాల్స్ ని పరిశీలించి పురపాలక సంఘ సిబ్బందిని అభినందించారు.

భీమవరం పురపాలక సంఘ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పారిశుధ్యం అనేది చాలా సున్నితమైన అంశమని, దాని కొరకు ప్రతి ఒక్కరూ తమవంతుగా బాధ్యతను నిర్వర్తించినట్లయితే సంపూర్ణ పారిశుద్యం సాధ్యమ‌వుతుందన్నారు. కావున ప్రజలందరూ బాధ్యతతో వారి కర్తవ్యాలు నెరవేర్చాల్సిందిగా తెలియజేస్తున్నారు. భీమవరం పట్టణంను స్వచ్ఛ భీమవరంగా తీర్చిదిద్దడానికి పాటుపడుతున్న పురపాలక సంఘ సిబ్బందికి, పారిశుధ్య‌ కార్మికులకు ధన్యవాదాలు తెలియజేసారు.

కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, మునిసిపల్ స్పెషల్ ఆఫీసర్, ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు, మున్సిపల్ ఇంజనీర్ త్రినాథ‌రావు, ఎంహెచ్వో సోమశేఖర్, ఫుడ్ ఇన్ స్పెక్ట‌ర్ రామచంద్రారెడ్డి, వార్డు సచివాలయ సిబ్బంది, పురపాలక సంఘ సిబ్బంది, మెప్మా సిబ్బంది, మున్సిపల్ పాఠశాలల సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply