కొత్తపల్లి సారథ్యంలో స్వాతంత్ర్య వేడుకలు

నర్సాపురం, ఆంధ్రప్రభ: కాపు కార్పొరేషన్ చైర్మన్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సారథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రస్తుంబాదాలోని ఆయన నివాసం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే స్వేచ్ఛా జీవితం లభించిందన్నారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని, జాతీయ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవాలని సూచించారు.

దేశ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని కోరారు. అనంతరం ఆయన నివాసం నుంచి పట్టణ పురవీధుల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రధాన సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి పట్టణ పరిసర ప్రాంతాల నుంచి ఆయన అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో దొండపాటి స్వాములు, కొత్తపల్లి నాని, గంధం రవిరామారావు, యర్రంశెట్టి బాబులు, గుగ్గిలపు మురళీ, యాదంరెడ్డి మహేష్ తదితరులు పాల్గొన్నారు.