ప్రజా సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం
- హక్కుల పరిరక్షణకు ఐక్యంగా రావాలి..
- జిల్లా కన్వీనర్ తిక్క రాజు పిలుపు.
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : మాదిగ హక్కుల పరిరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ, ఎస్సీలకు 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న హైదరాబాద్‌లో నిర్వహించనున్న “ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం” విజయవంతం చేయాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ( ఎం హెచ్ పి ఎస్ ) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ తిక్క రాజు పిలుపునిచ్చారు.ఈ సమావేశం జూలై 30న మధ్యాహ్నం 2 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్‌లో జరుగుతుందని తెలిపారు.
సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ, అంబేద్కర్ ఆశయాల సాధనకు కట్టుబడి ఉన్న ప్రజాసంఘాలు, సామాజిక కార్యకర్తలు, మేధావులు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల సంక్షేమానికి ప్రకటించిన హామీలను పూర్తిగా అమలు చేయాలని, అంబేద్కర్ ఆశయాల మేరకు సంక్షేమ పథకాలు అందరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని తిక్క రాజు విజ్ఞప్తి చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలిపారు.
