ఐఫోన్ స్పెషల్ ఎడిషన్ 4’ (SE 4) మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోందని. 2016 నుంచి 2020, 2022 వరకు మూడు ఎస్‌ఈ మోడళ్లను విడుదల చేసింది. కాగా, వచ్చే వారంలోనే SE 4 మోడల్ లాంచ్ ఉండొచ్చని, ఈ నెలాఖరులో విక్రయాలు ప్రారంభం కానున్నాయని సమాచారం.
2022లో ఆపిల్ ఐఫోన్ ఎస్‌ఈ 3ను విడుదల చేసింది. ‘పీక్ పర్ఫార్మెన్స్’ ఈవెంట్‌లో దీన్ని పరిచయం చేసింది. అయితే తాజా ఎస్‌ఈ 4ను ప్రత్యేక ఈవెంట్ నిర్వహించకుండా, నేరుగా వెబ్‌సైట్ ద్వారా అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది. అమెరికాతో పాటు భారత్‌లోనూ ఈ ఫోన్ ఆన్‌లైన్‌లో విక్రయించనున్నట్లు సమాచారం.
గత ఎస్‌ఈ మోడల్‌ను ఆపిల్ ₹43,900కి విడుదల చేసింది. అయితే కొత్త ఎస్‌ఈ 4 ధర మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫీచర్ల విషయానికొస్తే, కొత్త ఐఫోన్ ఎస్‌ఈ 4 మోడల్ ఐఫోన్ 14ను పోలి ఉంటుంది. ఇందులో హోమ్ బటన్, టచ్ ఐడీ లేకుండా.. గెశ్చర్ నావిగేషన్, ఫేస్ ఐడీ అందుబాటులోకి రానున్నాయి.
అలాగే, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌తో పాటు, యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో ఐఫోన్ 16లో వాడిన ఏ18 చిప్ ఉండొచ్చని సమాచారం. 6.1 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో రావడంతో, 4.7 అంగుళాల ఎస్‌ఈ 3తో పోలిస్తే ఈ ఫోన్ కొంత పెద్దగా ఉంటుంది.