విద్యుత్ తీగలు తగిలి మేకల కాపరి మృతి..

విద్యుత్ తీగలు తగిలి మేకల కాపరి మృతి..
యర్రావారిపాలెం ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ఇల్లపాలెం ఎస్టీ కాలనీకి చెందిన వలిపి సుబ్రహ్మణ్యం(50) అనే మేకల కాపరి శనివారం రాత్రి విద్యుత్ తీగలు తగిలి మృతి చెందారు. పేటి గుట్టలో రోజంతా తన మేకలను మేపు కుని సాయంత్రం ఇంటికి తీసుకొని రావడంతో రెండు మేకలు కనిపించకపోవడంతో వాటి కోసం తిరిగి గుట్టలో వెతికే క్రమంలో స్థానిక గుట్ట లో పంట పొలాల్లో కి వెళ్ళాడు అక్కడ అడవిపందుల వేట కోసం అమర్చిన కరెంటు వైరు తగిలి అక్కడికక్కడేప్రాణాలు కోల్పోయాడు.
వెంట వెళ్లిన భార్య, కుమారుడు ఈ ప్రమాదాన్ని గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
