Construction | సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు

Construction | సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు

  • సావిత్రిబాయి పూలే ఆశయాలు మరువలేనివి…

Construction | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలంలోని లింగాపూర్ చౌత్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే 195 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్(Special Officer) లావణ్యని గ్రామంలోని ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్ దుర్గి లక్ష్మీని, స్రవంతి చిట్యాలని, ఆకుల రజిత, పల్లికొండ యమునాని సన్మానించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సరస్వతి రాపాల మాట్లాడుతూ… సావిత్రిబాయి పూలే ఆశయాలను, కృషిని, త్యాగాలను కొనియాడారు. సావిత్రి ఆశయాల(Savitri Asyaala) కొనసాగింపు కోసం గ్రామంలోని మహిళలు యువకులు అన్ని వర్గాల ప్రజలు త్యాగంతో కూడిన పనులు చేయాలని ఆదర్శ గ్రామ నిర్మాణం (Construction)లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఉప సర్పంచ్ కనక మురళి గారు మాట్లాడుతూ… జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఆదర్శ దాంపత్యం సమాజానికి సదా ఆచరణీయమని తెలిపారు. అలాగే పూలే దంపతుల ను ఆదర్శంగా తీసుకొని లింగాపూర్ గ్రామ ప్రజలమైన మనమందరం ఆదర్శ గ్రామ నిర్మాణం కోసం కృషి చేద్దామని గ్రామ ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాపాల సరస్వతి, ఉపసర్పంచ్ కనకం మురళి, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి రాకేష్, వీడీసీ నాయకులు, యువకులు, ఆదర్శ మహిళామణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

Leave a Reply