ఎడపల్లి మండలంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
ఎడపల్లి, ఆంధ్రప్రభ: ఎడపల్లి మండలం జానకంపేట్‌లో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆదివాసీ నాయక్‌పోడ్ సంఘం పిలుపు మేరకు నాయక్‌పోడ్ కులస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ జెండాను ఆవిష్కరించి, హక్కుల కోసం పోరాడి అమరులైన వారికి నివాళులర్పించారు.
ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు ఐక్యంగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మెట్టు రాజు, మెట్టు దిగంబర్, మెట్టు సాయిలు, నిమ్మ మురళి, ఏనుగు లక్ష్మణ్, తమ్మల సుమన్, గణేష్, నరేష్, సతీష్, లక్ష్మణ్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో ఆదివాసీ నాయక్‌పోడ్ కులస్థులు పాల్గొన్నారు.
