NTR BHAROSA | లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ
NTR BHAROSA | బంటుమిల్లి, ఆంధ్రప్రభ : బంటుమిల్లి మండలం మల్లంపూడి గ్రామంలో సోమవారం (Monday) ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ (Kagita Krishna Prasad) ముఖ్యఅతిథిగా పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు (Pensions) పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి అర్హుడికి ఈ ప్రయోజనం ఆలస్యం లేకుండా చేరేలా మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న ప్రతి నిర్ణయం పటిష్టంగా అమలు అయ్యేలా పర్యవేక్షణ (monitoring) కొనసాగుతుందని తెలిపారు. వృద్ధులు ఆ కుటుంబానికి భారం కాకూడదనే సీఎం చంద్రబాబు ప్రతి అవ్వ, తాత, ఒంటరి మహిళలకు ఇంటి పెద్దకొడుకుగా, ఒక అన్నగా అండగా నిలుస్తున్నారని కొనియాడారు. ఆయన వెంట కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్థులు, తదితరులు ఉన్నారు.
