తుంగభద్ర నదిలో వ్యక్తి పై మొసలి మెరుపు దాడి..

తుంగభద్ర నదిలో వ్యక్తి పై మొసలి మెరుపు దాడి..

తృటిలో ప్రాణాలతో బయట వైనం

కోసిగి, ఆంధ్రప్రభ : తుంగభద్ర నది కి చేపల వేటకై వెళ్లిన వ్యక్తి పై మొసలి మెరుపు దాడి చేయడంతో తృటిలో ప్రాణాలతో బయట పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.బాధితులు, గ్రామస్తులు తెలిపిన మేరకు కోసిగి మండల పరిధిలోని చింతకుంట గ్రామం కు చెందిన బద్రి పెద్ద ఈరన్న అనే వ్యక్తి తోపాటు మరి కొంతమంది వ్యక్తులు గత ఐదు రోజుల క్రితం తుంగభద్ర నదిలోకి చేపల వేటకని వెళ్లారు.

అయితే తుంగభద్ర రైల్వే బ్రిడ్జి కింద నదిలో హనుమాపురం వైపు చేపలు పట్టేందుకు, చేపల వల నది నీళ్లలో వదలడం జరిగింది, అయితే కొంత సేపటి తరువాత బద్రి పెద్ద ఈరన్న చేపలు పడ్డాయేమోనని, తుంగభద్ర నదిలోకి దిగి చేపల వల తీస్తుండగా అక్కడే మాటు వేసుకున్న మొసలి పెద్ద ఈ రన్న పైఎడమ కాలు పిక్కలను పట్టుకుని కాస్త దూరం నదిలోకి లాక్కెళ్ళింది .ఆయన కేకలు వేయడంతో ఆయనతో పాటు చాపలు పట్టేందుకు వచ్చిన మరో ఎనిమిది మంది వెంటనే నదిలోకి దిగి మొసలి దాటి నుండి విడిపించుకోవడం జరిగిందని బద్రి పెద్ద ఈరన్న ను ప్రాణాలతో కాపాడారు..

అయితే నీటిలో మొసలి కరవడంతో ఎడమ కాలికి భారీ గాయమై 18 కుట్లు పడ్డాయని తెలిపారు.. ఈ విషయంపై అటవిశాఖ అధికారులను వివరణ కోరగా, తుంగభద్ర నదిలో మొసలిలు ఉన్నాయని కావున తెలియని వారు చేపలు వేటకు వెళ్లి ప్రమాదానికి గురికా వద్దన్నారు. అలాగే బద్రి పెద్ద ఈరన్న తెలిపిన వివరాల మేరకు తుంగభద్ర నది తో పాటు కోసిగి పక్కనే ఉన్నటువంటి పులికనుమ ప్రాజెక్టులో కూడా పెద్దపెద్ద మొసళ్ళు ఉన్నాయని ఆయన అన్నారు..

Leave a Reply