MINISTER| టీ షాపులో.. మంత్రి అలా చేశారా..?

MINISTER| కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఆయనో రాష్ట్ర మంత్రి అయినా.. సామన్యుడిలా అందర్నీ కలిసి కలివిడిగా ఉంటారు. రాష్ట్ర, జిల్లా కార్యక్రమాల్లో హడావిడిగా ఉండే మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) మచిలీపట్నంలో సోమవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సామాన్య వ్యక్తిలా పరువురిని ఆత్మీయంగా పలకరించారు. పట్టణంలోని ఐదు రోడ్ల కూడలి వద్ద టీ షాపు (Tea shop) లోకి వెళ్లి మహిళను ఆత్మీయంగా పలకరించి టీ తయారు చేశారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు టీ ని స్వయంగా మంత్రి అందించి ఆశ్యర్చపరిచారు. టీ షాపు యజమానురాలైన మహిళకు (to the woman) నగదు అందించగా, ఆమె తిరస్కరిస్తే.. లక్ష్మీ దేవిని వద్దనకూడడని నగదు అందించారు. ఈ సందర్భంగా రేవతి సెంటర్లోని ఆర్కె గుడ్ టైమ్స్ వద్ద ప్రజలతో(with the people) ముచ్చటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ తదిరతులు పాల్గొన్నారు.