ప్రతి సోమవారం ‘డయల్ యువర్ ఎస్‌ఈ’ కార్యక్రమం

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ ; నంద్యాల జిల్లా వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను తెలియచేయడానికి ప్రతి సోమవారం విద్యుత్తు శాఖ ఆధ్వర్యంలో డయల్ యువర్ విద్యుత్ ఎస్సీ కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యుత్ శాఖ అధికారి సుధాకర్ కుమార్ ఆదివారం తెలిపారు. జిల్లాలోని విద్యుత్తు వినియోదారులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యుత్ సమస్యల పరిష్కరించుకోవాల్సిందిగా కోరారు.

ప్రాంతంలో ఏ సమస్య ఉన్న విద్యుత్ కోతలు ఉన్న తాగునీరుకు సాగునీరుకు రైతుల ఇబ్బందులను చర్చించేందుకు ఈ అవకాశం ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమము ప్రతి సోమవారం ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. విద్యుత్తు సమస్యలు ఏదైనా ఉంటే విద్యుత్ వినియోగదారులు ఫోన్ నెంబర్ 08514-222989 కు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో సమస్యలను పరిష్కరించేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వినియోగదారులను ఎస్ ఈ కోరారు.

Leave a Reply