AP – కనకదుర్గ అమ్మవారి ప్రసాదంలో వెంట్రుకలు .. భక్తులకు సారీ చెప్పిన మంత్రి

విజయవాడ కనకదుర్గ అమ్మవారి ప్రసాదంలో అపచారం చోటు చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా… ప్రసాదంలో వెంట్రుకలు కనిపించాయి. తాజాగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి ప్రసాదంలో వెంట్రుకలు దర్శనం ఇచ్చాయి.

ప్రసాదంలో నాణ్యత లేదని.. ఉదయం ఓ లడ్డూలో, మరో లడ్డూలోనూ వెంట్రుకలు కనిపించడంతో తాను నిర్ఘాంతపోయినట్లు ఆ భక్తుడు పేర్కొన్నారు.

ఆ పోస్ట్‌లో మంత్రులు నారా లోకేష్, ఆనం రామానారయణ రెడ్డిలను ట్యాగ్ చేశాడు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ప్రసాదంలో వెంట్రుకలు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌కావడంతో.. భక్తుడు చేసిన ఫిర్యాదు పై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారయణ రెడ్డిస్పందించారు. భక్తుడికి క్షమాపణ చెబుతూ ఇంకో సారి తప్పు జరగకుండా చూస్తానని వెల్లడించారు.

Leave a Reply