TG | ఎయిమ్స్ నర్సింగ్ అధికారిపై కత్తితో దాడి

TG | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో భయాందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. బీబీనగర్‌లోని పోచంపల్లి రోడ్డు చౌరస్తా వద్ద ఓ వ్యక్తి సైకోలా రెచ్చిపోయి ఎయిమ్స్ నర్సింగ్ అధికారిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
దాడి చేసిన వ్యక్తిని స్థానికులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దాడిలో గాయపడిన నర్సింగ్ అధికారికి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటనతో బీబీనగర్ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
