గిట్టుబాటు ధర చెల్లించేందుకు కొనుగోలు కేంద్రాలు…

గిట్టుబాటు ధర చెల్లించేందుకు కొనుగోలు కేంద్రాలు…
ఊట్కూర్, ఆంధ్రప్రభ : రైతులు పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధర చెల్లించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని ఊట్కూర్ తాసిల్దార్ చింతరవి, ఎంపీడీవో కొండన్న, మండల కాంగ్రెస్ అధ్యక్షులు డి. యజ్ఞేశ్వర్ రెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి గణేష్ రెడ్డి, ఏపీఎం వనిత కుమారిఅన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోనిఅవుసలోనిపల్లి, పులి మామిడి గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహించిన వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం విక్రయించాలన్నారు. రైతులు పండించిన వరి ధాన్యం గ్రేడ్ ఏ రకానికి రూ. 2389, సాధారణ రకం రూ.2369, సన్న రకం వరి ధాన్యానికిరూ.500 బోనస్ చెల్లిస్తున్నట్లు తెలిపారు.
రైతులు ఎంతో కష్టపడి పండించిన వరి ధాన్యం దళారులకు విక్రయించకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్ని బ్యాగులతో సహా వివిధ వసతులు ఏర్పాటు చేస్తున్నామనిఅన్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుందనిఅన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎల్లమ్మ తిమ్మప్ప, ఆర్ ఐ వెంకటేష్, ఏఈఓలు స్వప్న, తిలక్, మహిళా సంఘం అధ్యక్షులు రాధమ్మ, శాంతమ్మ, తదితరులు పాల్గొన్నారు.
