జైపూర్ – రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ్‌నోక్ రైల్వేస్టేషన్ నుంచి 18 రాష్ట్రాల్లో ఆధునీకరించిన 103 అమృత్ రైల్వే స్టేషన్లను నేడు ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో తెలంగాణలో 3 ఏపీలో 1, యూపీలో 19, గుజరాత్ 18, మహారాష్ట్రలో 15, రాజస్థాన్‌లో 8 రైల్వేస్టేషన్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ పాల్గొన్నారు. అంతకుముందు బికనీర్‌లోని కర్ణిమాత ఆలయాన్ని ఆయన సందర్శించారు. అమ్మవారికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మ వారి తీర్థ ప్రసాదాలను ఆలయ పూజారులు.. ప్రధాని మోదీకి అందజేశారు. అనంతరం బికనీర్ ఎయిర్ బేస్‌ను మోదీ సందర్శించారు. మరోవైపు బికనీర్ సమీపంలో పాలనా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
Dedicated | 103 అమృత్ రైల్వే స్టేషన్ లను జాతికి అంకితమిచ్చిన ప్రధాని మోడి
