Cyclone | నెల్లూరులో వర్షాలు..
Cyclone | నెల్లూరులో వర్షాలు..
Cyclone, నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : దిత్వా (Dithwa) తుఫాను ప్రభావంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు గురువారం కూడా కొనసాగాయి. ముఖ్యంగా నెల్లూరు రూరల్, వెంకటాచలం మండలాల్లో, నెల్లూరు నగరంలో జోరుగా వాన కురుస్తోంది. మనుబోలు వద్ద జాతీయ రహదారి పై ట్రాఫిక్ స్థంభించి పోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్ ను మళ్లీస్తున్నారు. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో రహదారుల పైకి నీరు ప్రవహిస్తూ రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. సముద్రం ఎత్తైన అలలతో విరుచుకుపడుతోంది. తుఫాను సహాయక చర్యలు వేగవంతం చేయాలని మంత్రులు రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణలు అధికారులను ఆదేశించారు.
