Cricket | క్రీడ నైపుణ్యాన్ని వెలికి తీయాలి

Cricket | క్రీడ నైపుణ్యాన్ని వెలికి తీయాలి
Cricket | చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండలం నేరడ గ్రామంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో మొత్తం ఆరు టీములు పాల్గొన్నాయి. మొదటి బహుమతి 10,000 వేల రూపాయల నగదు, రెండో బహుమతి 5000 రూపాయల నగదును భారతీయ జనతా పార్టీ నాయకుడు కాసోజు శంకరాచారి విజేతలకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో యువకులకు క్రీడా ప్రాంగణం లేదని గుర్తు చేశారు. రాబోయే రోజులలో పార్టీలకు సంబంధం లేకుండా క్రీడా స్థలం కోసం కృషి చేస్తామని అన్నారు.
