Cricket | ప్రోత్సాహకం..

Cricket | ప్రోత్సాహకం..

  • మహిళా క్రికెటర్ శ్రీచరణికి నగదు
  • రూ.2.5 కోట్ల చెక్‌ను అందజేసిన మంత్రి నారా లోకేష్

Cricket | అమరావతి, ఆంధ్ర‌ప్ర‌భ : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రాష్ట్రానికి చెందిన మహిళా క్రికెటర్ శ్రీచరణికి కూటమి ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సహకాన్ని అందజేసింది. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ స్వయంగా ఆమెకు చెక్‌ను ఇచ్చారు. కడప జిల్లాకు చెందిన శ్రీచరణి అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్నారు. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఆమె అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

ఆమె ప్రతిభను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సహకాలు ప్రకటించింది. నగదు తోపాటు విశాఖలో 500 గజాల విస్తీర్ణం గల ఇంటి స్థలాన్ని కేటాయించింది. డిగ్రీ పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్-1 హోదా ఉద్యోగాన్ని కల్పించనుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమంలో రవాణా, యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, క్రీడాశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, శాప్ ఎండీ భరణి, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ డి.శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ బి.విజయ్ కుమార్ పాల్గొన్నారు.

Leave a Reply