Corona Positive | బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ కు కరోనా….

ముంబయి – సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ చెల్లెలు శిల్పా శిరోద్కర్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు సోమవారం తన ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టారు. ‘ హల్లో పీపుల్.. నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. మీరు జాగ్రత్తగా ఉండండి. మాస్కులు ధరించండి‘ అని పేర్కొన్నారు.

బిగ్‌బాస్ 18తో గుర్తింపు

శిల్పా శిరోద్కర్ 989 నుంచే సినిమాల్లో నటిస్తున్నది. 2000 సంవత్సరంలో సినిమాలకు దూరం అయ్యారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత బరూద్ అనే సినిమాతో మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. మళ్లీ సినిమాలకు దూరం అయ్యారు. పది సంవత్సరాల తర్వాత 2020లో గన్స్ ఆఫ్ బనారస్ అనే సినిమాలో నటించింది..ఇక
శిల్ప సినిమాలకు దూరంగా ఉన్నా సీరియల్స్ మాత్రం చేస్తూ వచ్చింది. 2013 నుంచి 2018 వరకు ఏక్ ముత్తి ఆస్మాన్, సిల్‌సిలా ప్యార్‌కా, సావిత్రి దేవీ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో నటించింది. సినిమాలు సీరియల్స్‌తో రాని గుర్తింపు బిగ్‌బాస్ షోతో వచ్చింది. బిగ్‌బాస్ 18లో ఆమె పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది

Leave a Reply