Congress | బెల్లంపల్లి నూతన ఏఎంసీ చైర్మన్ లక్ష్మికి సన్మానం

Congress | బెల్లంపల్లి నూతన ఏఎంసీ చైర్మన్ లక్ష్మికి సన్మానం

Congress | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌ రత్నం లక్ష్మిని కాసీపేట మండలానికి చెందిన కాంగ్రెస్ లీడర్లు సంక్రాంది పర్వదినాన్ని పురస్కరించుకోని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీ కాసీపేట మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్‌లను వారు శాలువాతో సన్మనించారు. కాసిపేట గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ బూరుగుపల్లి రమేష్ ఆధ్వర్యంలో నాయకులు వారిని కలిసి ప్రత్యేకంగా అభినందించారు. నూతనంగా ఏఎంసీ చైర్మన్ గా నియమింపబడ్డ రత్నం లక్ష్మి ఈ ప్రాంతానికి చెందిన రైతులకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోగే రామకృష్ణ, నాగపూరి శ్రీనివాస్, శిలాయితుల శ్రీనివాస్, సాకార్మన్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply