మిర్చి లారీ బోల్తా…
రోడ్డు దాటుతున్న వ్యక్తిని తప్పించబోయి అదుపు తప్పిన లారీ
ఇబ్రహీంపట్నం – ఛత్తీస్ గఢ్ జాతీయ రహదారిపై కొండపల్లి శ్రామిక నగర్ వద్ద ఘటన
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఇబ్రహీంపట్నం – ఛత్తీస్ గఢ్ జాతీయ రహదారిపై కొండపల్లి శ్రామిక నగర్ (కొత్తగేటు) వద్ద శుక్రవారం మిర్చి లారీ అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. అతి వేగంగా వస్తున్న లారీ రోడ్డు దాటుతున్న వ్యక్తిని తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. రోడ్డు దాటుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
అతన్ని చికిత్స నిమిత్తం ట్రాఫిక్ పోలీసులు అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వాహనాలు రాకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది. లారీ రోడ్డు మధ్యలో పడిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు లారీని తొలగించేందుకు క్రేన్ ను రప్పిస్తున్నారు.
