Collectorate | అట్టహాసంగా జాతీయ స్థాయి కార్యక్రమం సారస్..

Collectorate | అట్టహాసంగా జాతీయ స్థాయి కార్యక్రమం సారస్..

Collectorate | గుంటూరు కలెక్టరేట్ – ఆంధ్రప్రభ : సారస్ (SARAS – Sale of Articles of Rural Artisans Society -సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్ సొసైటీ) జాతీయ స్థాయి కార్యక్రమమని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. సారస్ వేదికను ఇవాళ ఉదయం జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సారస్ ప్రదర్శన జనవరి 6వ తేదీ నుండి 18వ తేదీ వరకు గుంటూరులో జరుగుతుంది. గుంటూరు పట్టణంలో నర్సరావుపేట రహదారిలో రెడ్డి కళాశాల ఎదురుగా ఉన్న స్థలంలో ప్రదర్శన శాలల ఏర్పాటుకు ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. ఏర్పాటు చేస్తున్న హ్యాండ్లూమ్స్, హ్యాండిక్రాఫ్ట్స్, చీరలు, షాల్స్, కార్పెట్లు, బెడ్ షీట్ లు, వెదురు, లోహ, ఆభరణాలు, గృహ అలంకరణ వస్తువులు, గాజు ఉత్పత్తుల ప్రదర్శన శాలలు., సాంప్రదాయ, ఆర్గానిక్ ఆహార పదార్థాల శాలలు., వెల్కమ్ లాంజ్, కంట్రోల్ రూమ్ , సాంస్కృతిక ప్రదర్శన వేదిక, చిల్డ్రన్ పార్క్ తగితర ప్రదేశాలను తనిఖీ చేశారు.

Collectorate

సారస్ ను సందర్శించే ప్రతి ఒక్కరూ ఆనందంగా, సంతోషంగా, సంతృప్తితో తిరిగి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మూడు వందల ప్రదర్శన శాలల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇందులో 150 స్టాల్ లు ఇతర రాష్ట్రాల నుండి ఏర్పాటు చేస్తుండగా, రాష్ట్రం నుండి 150 స్టాల్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సారస్ ను రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సౌజన్యంతో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ నిర్వహిస్తోందన్నారు. గుంటూరు మిరపకు ప్రసిద్ధి చెందడంతో “మిరప కాయ” నే మస్కట్ గా ఎంపిక చేశామని చెప్పారు. రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా జాతీయ స్థాయి సారస్ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు ఉచిత ప్రవేశం, పార్కింగ్ సదుపాయం ఉందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ఆయా రాష్ట్రాల సంస్కృతులను ప్రతిబింబించే చేనేతలు, హస్తకళలు, ఇతర సామగ్రిని ప్రదర్శించడం, విక్రయించడం జరుగుతుందని తెలిపారు. భారత దేశ విభిన్న ఆహార పదార్థాల ఘుమ ఘుమలకు సిద్ధం అవుతుందన్నారు.

Collectorate

ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, గుంటూరు నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయ లక్ష్మి, డి.ఆర్.డి.ఏ సహాయ ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్ కుమార్, డి.పి.యం అశోక్, ఎల్.డి.ఎం మహిపాల్ రెడ్డి, నగర పాలక సంస్థ పర్యవేక్షక ఇంజనీర్ సుందరరామి రెడ్డి, కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు నరేందర్, పంకజ్ కుమార్, తహసిల్దార్ వెంకటేశ్వర రావు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగసాయి కుమార్, జిల్లా సాంఘీక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, డి.ఎస్.పి భానోదయ, పర్యాటక అధికారి రమ్య, జిల్లా అగ్నిమాపక అధికారి ఎం.శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Collectorate

Leave a Reply