మెగా డీఎస్సీపై విమర్శలు మానండి
మెగా డీఎస్సీపై విమర్శలు మానండి
ప్రతిభతోనే 16 వేల ఉద్యోగాలు- డాక్టర్ గ్లోరి యానెట్ సౌపాటి
బాపట్ల, ఆంధ్రప్రభ:
మెగా డీఎస్సీపై వస్తున్న విమర్శలను బాపట్ల పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ గ్లోరి యానెట్ సౌపాటి తీవ్రంగా ఖండించారు. గత ఏడాది నిర్వహించిన మెగా డీఎస్సీ ద్వారా ప్రతిభ ఆధారంగా 16 వేల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది కూడా డీఎస్సీ నోటిఫికేషన్ అక్టోబర్‌లో విడుదల కానుందని తెలిపారు.
హారిజంటల్ రిజర్వేషన్ల అమలుపై సుప్రీంకోర్టు ఆదేశాలు, జీవో నెం.77 ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. డీఎస్సీ నియామకాలు పూర్తిగా పారదర్శకంగా, కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా నిర్వహిస్తున్నందున అవకతవకలకు అవకాశం లేదన్నారు. యువతకు ఇచ్చిన హామీలను మంత్రి నారా లోకేష్ అమలు చేస్తూ ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం కృషి చేస్తున్నారని గ్లోరి పేర్కొన్నారు. విమర్శల కంటే ప్రభుత్వ ఉత్తర్వులు, న్యాయస్థాన తీర్పులను పరిశీలించాలని ప్రతిపక్షాలకు సూచించారు.
