పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు

పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు

కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ

విజయవాడ, ఆంధ్రప్రభ : ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం అనేది విశ్వాసం, నియమశీలత, త్యాగం, కరుణ వంటి మహోన్నత విలువలను మన జీవన విధానంలో ప్రతిబింబించే ఆధ్యాత్మిక యాత్ర అని పేర్కొన్నారు.

ఉపవాస దీక్షలు మనస్సును పరిశుభ్రం చేయడమే కాకుండా, అవసరంలో ఉన్నవారి పట్ల సానుభూతి కలిగించే గొప్ప సాధనమని అన్నారు. సమాజంలో ఐక్యత, సోదరభావం, పరస్పర గౌరవం మరింత బలపడేలా ముస్లిం సోదరులు దానధర్మాలు, సేవా కార్యక్రమాల ద్వారా రంజాన్ నిజమైన స్ఫూర్తిని చాటి చెబుతారని పేర్కొన్నారు. ఈ పవిత్ర సందర్భంలో ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, ప్రతి హృదయంలో శాంతి నిండాలని, సమాజంలో సౌభ్రాతృత్వం చిరస్థాయిగా నెలకొనాలని కలెక్టర్ ఆకాంక్షించారు. విశ్వాసం మనకు దారి చూపుతుంది… దయ మనలను కలుపుతుంది… సేవ మన సమాజాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది – ఇదే రంజాన్ సందేశం అని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు.

Leave a Reply