నిబద్ధత గల పాత్రికేయుడు పూర్ణ…

నిబద్ధత గల పాత్రికేయుడు పూర్ణ…

పూర్ణ మరణం తీరని లోటు
జర్నలిస్ట్ పూర్ణ భౌతిక కాయానికి నివాళులు…

పటమట, ఆంధ్రప్రభ : పాత్రికేయ వృత్తి లో మూడు దశాబ్దాల కాలం నిబద్ధతతో సేవలు అందించి ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ హుషారుగా గడిపిన కె.పూర్ణ చంద్రరావు (పూర్ణ)అకాల మరణం కలచివేసిందని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ని వ్యక్తం చేస్తున్నాని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ అన్నారు. ప్రముఖ ఛానల్ లో పనిచేస్తూ అనారోగ్యం తో బాధపడుతూ తుది శ్వాస విడిచిన కీసంనేని పూర్ణ చంద్రరావు భౌతిక కాయాన్ని పటమటలంకలోని అయన నివాసం జిల్లా కలెక్టర్ శుక్రవారం సందర్శించి నివాళులు అర్పించారు .

పూర్ణ పాత్రికేయ వృత్తి లో చురుకు గా పనిచేసేవారని అందరితో కలుపుగోలుతనంతో వ్యవహరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు.ఆయన అకాల మరణం తీరని లోటుగా భావిస్తున్నారు జిల్లా కలెక్టర్ తెలిపారు.

Leave a Reply