సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.6.50 లక్షల సాయం మంజూరు

సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.6.50 లక్షల సాయం మంజూరు
రోటవేటర్ ప్రమాదంలో గాయపడిన రైతు కుటుంబానికి కూటమి ప్రభుత్వ అండ
తిరువూరు, ఆంధ్రప్రభ , కుని తీవ్రంగా గాయపడిన యువకుడి కుటుంబానికి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అండగా నిలిచారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద రూ.6.50 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేయించి బాధిత కుటుంబానికి ఊరట కలిగించారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని ఏ.కొండూరు మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన గుండా బాలకిషోర్ వ్యవసాయ పనుల సమయంలో రోటవేటర్‌లో చేయి చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో చేయి తీవ్రంగా దెబ్బతినడంతో అత్యవసర శస్త్రచికిత్స అవసరమైంది. చికిత్సకు భారీ ఖర్చు అవుతుండటంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది.
ఈ పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వెంటనే స్పందించి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.6,50,000 మంజూరు చేయించేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం శాంక్షన్ పత్రాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు ఆపద సమయంలో అండగా నిలవడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పెద్ద భరోసా ఇస్తోందని పేర్కొన్నారు.
సమయానికి స్పందించి ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ప్రత్యేక చొరవ చూపిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
