MLA | వడ్డీ లేని రుణాల పంపిణీ..

MLA | వడ్డీ లేని రుణాల పంపిణీ..

మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు….. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

MLA | జనగామ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందించడం ప్రశంసనీయమని జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) అన్నారు. ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం వడ్డీ లేని రుణ పంపిణీ పథకం ముందుకు తీసుకుపోవడం ప్రశంసనీయమని అన్నారు. జనగామ పట్టణ నర్మెట తరిగొప్పుల బచ్చన్నపేట మండలాలకు చెందిన సహాయక సంఘాలకు రుణాల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షా లోము వ్యవసాయ మార్కెట్ చైర్మన్ భానుక శివరాజ్ యాదవ్ ఆర్డిఓ డి ఆర్ డి ఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు.