శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ చిట్టినగర్ శ్రీ నగరాల సీతారామ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ గరుడాచల స్థిత వేంకటేశ్వర స్వామి వారికి స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణే జ్యేష్ట మాసే శుక్ల పక్షం పౌర్ణమి సోమవారం నాడు 15 వ వార్షిక బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ జరిగింది. ఈసందర్భంగా శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ గురడాచల స్థితి వేంకటేశ్వర స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం 9 గం కృష్ణ నది నుండి పవిత్ర జలాలతో సహాస్ర కలశ యాత్ర నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులకు కలశాభిషేకం నిర్వహించారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నుంచి పెండ్లి కూమారుని గాను, పద్మావతి, గోదాదేవి అమ్మవార్లు ను పెండ్లి కుమార్తెలు గా అలంకరించారు. శ్రీ వెంకటేశ్వరస్వామి, అమ్మవారిలకు మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. సాయింత్రం విష్వక్సేన పుణ్య వచనం, అఖండ దీపారాధన, వాస్తు పూజ, వాస్తు హోమం దీక్షా చరణం, కంకణ ధారణ, గరుడా ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు విచారణ జరిపించారు. ఈ కార్యక్రమం లో పాలక మండలి సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
