Chennur | రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి…

Chennur | రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి…

Chennur | చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కత్తారశాల గ్రామం సమీపంలో రోడ్డు ప్రమాదంలో సాత్విక్ అనే బాలుడు దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు.

కోటపెల్లి మండలం ఆలగాం గ్రామానికి చెందిన కుమ్మరి రాజయ్య తన కుమారుడు సాత్విక్‌తో కలిసి బైక్‌పై మహాదేవ్‌పూర్ (భూపాలపల్లి జిల్లా) లోని బంధువుల వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్నారు.

ఈ సమయంలో కత్తారశాల గ్రామం వద్ద ఎదురుగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టింది. ఢీకొనడంతో సాత్విక్ అక్కడికక్కడే మృతి చెందాడు. రాజయ్య సహా మరో వ్యక్తి గాయపడగా, వారిని 108 అంబులెన్స్ ద్వారా చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై చెన్నూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply