Chakepalli | ఘనంగా జెండా పండుగ

Chakepalli | ఘనంగా జెండా పండుగ

  • హక్కుల కోసం ఐక్యంగా పోరాటం

Chakepalli | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ఆదివాసి కొలవార్( మన్నెవార్ )24వ ఆత్మగౌరవ జెండా పండుగ వేడుకలు ఈ రోజు బెల్లంపల్లి మండలం చాకెపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ మాజీ సర్పంచ్ జంబి బాయమ్మ, గ్రామ పెద్దలు జంబి వెంకటీలు గిరిజనుల ఆత్మగౌరవ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి కుల వార్ మన్నేవారు గ్రామ నాయకులు చింతపూరి రమేష్, జమ్మి శ్రీనివాస్, జమ్మి మహేందర్, జంబి లక్ష్మి, జంబి రాసూరి లక్ష్మి, ఎల్లారి రవి, పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.

Leave a Reply