Kamareddy | మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలి…

Kamareddy | మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలి…

Kamareddy | బిక్కనూర్, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా (Kamareddy district) బిక్కనూరు మండల కేంద్రంలో ఈనెల 20న జరగనున్న మంత్రుల పర్యటన విజయవంతం చేయాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాతరాజు (Pata Raju) కోరారు. బుధవారం మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మార్కెట్ కమిటీ ఆవరణంలో సుమారు రూ.93లక్షల వ్యయంతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao), రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క (seethakka) చేతులమీదుగా భూమిపూజ చేయించడం జరుగుతుందని తెలిపారు.

మంత్రులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ (Shabbir Ali), జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షట్కర్ హాజరవుతారని చెప్పారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర కాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమ్ రెడ్డి, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దయాకర్ రెడ్డి సిద్ధిరామేశ్వర ఆలయ పునర్ నిర్మాణ కమిటీ చైర్మన్ లింబాద్రి, నాయకులు నరసింహారెడ్డి, సత్యం, సిద్ధిరాములు, ఆంజనేయులు, వెంకటేశం, రవి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply