జనగణన-2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం

రాయపర్తి, ఆంధ్రప్రభ : రాయపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జనగణన-2027 సర్వే నిర్వహణపై ఎన్యూమరేటర్లకు శనివారం శిక్షణ కార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీమతి జి. సంధ్యారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్యూమరేటర్లు వారికి కేటాయించిన బ్లాక్ పరిధిలో ప్రతి ఇంటిని, ఇన్స్టిట్యూషన్లను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత సమయంలో జనగణన పూర్తి చేయాలని సూచించారు.

జనగణనను దేశానికి చేస్తున్న సేవగా భావించి ఓపిక, సహనంతో ప్రతి ఒక్కరినీ జనగణనలో చేర్చేలా కృషి చేయాలని కోరారు.కార్యక్రమంలో వరంగల్ రెవెన్యూ డివిజనల్ అధికారిణి శ్రీమతి టి. సుమ, మండల తహసీల్దార్ ఎం. శ్రీనివాస్, ఎంపీడీవో కిషన్ నాయక్, ఎంఈఓ శ్రీనివాస్, స్థానిక హెచ్ఎం జి. కృష్ణమూర్తి, మండల గిర్దావర్ చంద్రమోహన్, ఎంపీఎస్ఓ కళ్యాణ్, టెక్నికల్ అసిస్టెంట్ సబా అమరిన్, ఫీల్డ్ ట్రైనర్లు రమేష్, సురేష్ బాబు, జీపీఓ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply