ఇది బడ్జెట్ కాదు కేవలం అంకెల గారెడీ మాత్రమే

ఇది బడ్జెట్ కాదు కేవలం అంకెల గారెడీ మాత్రమే

  • బిఆర్ ఎస్ నాయకులు జక్కుల వెంకటేశ్వర్లు

భీమారం, ఆంధ్రప్రభ ; రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడీ మాత్రమే అన్నారు బి.ఆర్.ఎస్ నాయకులు, 57వ డివిజన్ మాజీ కార్పొరేటర్ జక్కుల వెంకటేశ్వర్లు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆదేశాల మేరకు ఆదివారం బిఆర్ఎస్ నాయకులు ఎర్రగట్టుగుట్ట ప్రాంతంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జక్కుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దివాలా తీసే దిశగా తీసుకెళ్లిందని అన్నారు.

కాంగ్రెస్ అధికారం చెప్పట్టి 800రోజులు గడుస్తున్న ఇచ్చిన 6 గ్యారెంటీ లో ఒక్కటి కూడా అమలు చేయలేదని అన్నారు.మూడో సారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన ప్రభుత్వం తెలంగాణ 4 కోట్ల ప్రజానీకానికి కుచ్చుటోపి పెట్టిందని పేర్కొన్నారు. అభివృద్ధిలో వీసం ఎత్తు కూడా జరగలేదు కానీ ప్రచారంలో మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉదరగొడుతుందని కార్పొరేటర్ సిరంగి సునీల్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమం లో 66 డివిజన్ అధ్యక్షుడు పాపి శెట్టి శ్రీధర్,హాసన్ పర్తి మండల అధ్యక్షుడు బండి రజిని కుమార్, సంగాల విక్టరీ బాబు,జక్కు రమేష్, నరెడ్ల శ్రీధర్,వల్లాల శ్రీకాంత్,అటికం రవీందర్,లక్ష్మణ్, నాగరాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.