జర్నలిస్ట్ రాజేష్ కు మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శ
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జర్నలిస్ట్ రాజేష్ మచిలీపట్నం సర్వజన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకుని ఆస్పత్రి వైద్యులను మంత్రి రవీంద్ర అప్రమత్తం చేసారు. శనివారం ఆస్పత్రిలో కోలుకుంటున్న రాజేష్ ని మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించి ధైర్యం చెప్పారు. రాజేష్ కు అందుతున్న వైద్య సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రాణాపాయం లేదని మంత్రికి వైద్య బృందం తెలిపారు.
తలకు స్వల్ప గాయమవ్వటంతో సిటీ స్కాన్ చేశామని..రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయని వైద్యులు తెలిపారు. 24గంటలు అబ్జర్వేషన్ లో ఉంచి డిశ్చార్జ్ చేస్తామన్నారు. రాజేష్ ని పరామర్శించిన వారిలో టీడీపీ జిల్లా అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి, మున్సిపల్ మాజీ ఛైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ డా. హసీమ్ బేగ్, మాజీ కౌన్సిలర్ బత్తిన దాస్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ డైరెక్టర్ బోయిన రాజు, ఇలియాస్ పాషా తదితరులు ఉన్నారు.
