Boya Valmikulu | ఎస్టీ జాబితాలో చేర్చాలి..
Boya Valmikulu | ఎస్టీ జాబితాలో చేర్చాలి..
- పార్లమెంట్‌లో గళమెత్తిన నంద్యాల ఎంపీ
Boya Valmikulu | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఏపీలోని బోయ వాల్మీకులను ఎస్టీ జాబితా(List of ST)లో చేర్చడం సరైనది కాదని బుధవారం లోక్‌సభలో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి(Dr. Byreddy Sabari) గళమెత్తారు. మన శాసనాలు ఈ శక్తివంతమైన వేటగాళ్ళ గురించి, వారి ఏకైక వృత్తి వేట అన్నారు. మన శాసనాలు ఈ శక్తివంతమైన వేటగాళ్ల(Powerful hunters) గురించి చెబుతున్నాయి అన్నారు. వారి ఏకైక వృత్తి వేట, ఇప్పుడు అటవీ ఉత్పత్తులను, వ్యవసాయాన్ని సేకరించడం.. వారు ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారన్నారు.
ఈ వ్యక్తులను 1871లో క్రిమినల్ ట్రైబల్ చట్టంలో చేర్చారని మనకు గుర్తు చేయడానికి ఇది ఒక కారణమని, 1961లో భారత డిప్యూటీ రిజిస్ట్రార్ జనరల్(Deputy Registrar General) కూడా బోయ కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని పేర్కొన్నారని లోక్ సభ దృష్టికి ఎంపీ తెచ్చారు. 2017లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో శాసనసభ, మండలిలో కమిషన్ కూడా ఏర్పాటు చేసి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి ఏకగ్రీవంగా అసెంబ్లీ(Assembly) ఒక తీర్మానం ఆమోదించిందని ఆమె గుర్తు చేశారు.
గత వైసీపీ ప్రభుత్వం బోయ కులస్థులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని వాగ్దానం చేసి, రాజకీయ లాభాల కోసం వారిని ఉపయోగించుకున్నారన్నారు. పొరుగున ఉన్న కర్ణాటక(karnataka) వంటి రాష్ట్రంలో బోయ వాల్మీకులు ఎస్టీ హోదాను కలిగి ఉన్నప్పుడు, ఇతర రాష్ట్రాలు, కొన్ని ప్రదేశాలు ఎస్సీ హోదాను(SC status) పొందుతున్నాయన్నారు.
ఏపీలో ఎందుకు ఈ హోదాను పొందకూడదు? అని నిలదీశారు. స్పీకర్ మేడం.. నేను ప్రభుత్వాన్ని ఒక బిల్లును ప్రవేశపెట్టాలని, న్యాయం చేయాలని(To do justice) అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే ఇది రాజకీయపరమైనది కాదు.. ఇది న్యాయం, రాజ్యాంగ సమానత్వం యొక్క విషయం. ఈ సమాజానికి దయచేసి న్యాయం చేయమని మంత్రిత్వ శాఖ(Ministry of)ను, కేంద్ర ప్రభుత్వాన్ని నేను అభ్యర్థిస్తున్నాను. అంటూ లోక్ సభలో ఎంపీ ప్రసంగించారు. దీంతో రాష్ట్రంలోని వాల్మీకులందరూ సంతోషం వ్యక్తం చేశారు.
