గుడిరేవు ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు.

దండెపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను గుడిరేవు ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణలో జరుపుకునే ప్రధాన పండుగల్లో ఒకటైన బోనాల పండుగ విశిష్టతను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బొలిశెట్టి బుచ్చన్న విద్యార్థులకు వివరించారు.

పండుగలోని ముఖ్యమైన ఘట్టాలైన ఊరేగింపు, రంగమెక్కడం, బోనం సమర్పణ వంటి ఆచారాలను ప్రత్యక్షంగా చూపిస్తూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు వివరించారు.

పోతురాజుల వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు, తల్లిదండ్రులను ఈ వేషధారణ ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు శ్యామల, పాఠశాల కమిటీ చైర్మన్ స్వరూప, అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు లక్ష్మి, ప్రీ-ప్రైమరీ శిక్షకురాలు ధనలక్ష్మి, విద్యా వాలంటీర్ అభినవ్, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.