ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

పారాక్వాట్ గడ్డి మందుల విక్రయంపై కఠిన హెచ్చరిక

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : పట్టణంలోని ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో శుక్రవారం వ్యవసాయ అధికారి రామ్ నర్సయ్య, ఎస్సై మహేందర్‌రెడ్డి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా దుకాణాల్లో లైసెన్సులు, స్టాక్ రిజిస్టర్లు, మందుల నిల్వలను పరిశీలించారు.

అనంతరం అధికారులు మాట్లాడుతూ నిషేధిత లేదా నిబంధనలకు విరుద్ధంగా పారాక్వాట్ గడ్డి మందులను విక్రయిస్తే సంబంధిత దుకాణదారులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, రైతులకు నాణ్యమైన, అనుమతించబడిన వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని సూచించారు.