boat tour | గోదావరి ఒడిలో ‘పాపి కొండలు’ విహారం!

boat tour | గోదావరి ఒడిలో ‘పాపి కొండలు’ విహారం!

boat tour | పాపికొండలు ఎందుకు ప్రత్యేకం?
పాపికొండలకు వెళ్లే ప్రధాన మార్గాలు
గోదావరి బోటింగ్‌లో మరపురాని అనుభూతి
వేసవిలో పాపికొండల చల్లటి స్వాగతం
బోట్ టూర్ ప్యాకేజీలు, ధరలు
నైట్ క్యాంపింగ్‌లో లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్
ముందస్తు బుకింగ్ ఎందుకు ముఖ్యం?
పర్యాటకులకు ముఖ్య సూచనలు

boat tour | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌ : పచ్చని ప్రకృతి.. చుట్టూ దట్టమైన అడవులు, వాటి మధ్యలో పలకరిస్తూ.. సాగిపోయే గోదావరి నది.. ఈ అందాల కలయికే పాపి కొండలు. మనకున్న బిజీ లైఫ్ నుంచి కాస్త సమయం తీసుకుని, మనసుకు ప్రశాంతతను ఇచ్చే ఒక అద్భుతమైన ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే, పాపికొండలు
ట్రీఫ్‌ మీకు బెస్ట్ ఆప్షన్.

దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధమైన నదీ విహారయాత్రలలో పాపి కొండలు ప్రయాణం ఒకటి. కాశ్మీర్ లోని లోయలను తలపించేలా ఉండే ఈ ప్రాంతం, పకృతి ప్రేమికులకు ఒక స్వర్గధామం. అయితే, అక్కడికి ఎలా వెళ్లాలి? ఏ మార్గం బెస్ట్? ప్యాకేజీలు ఎలా ఉంటాయి? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం..

boat tour

పాపికొండలు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న ఒక కొండ శ్రేణి. పాపికొండలు ఖమ్మం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో విస్తరించి ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని కోరూరు నుండి పాపికొండల ప్రవేశద్వారం కనిపిస్తుంది.

ప్రయాణం ఎక్కడి నుండి ప్రారంభించవచ్చు?
పాపి కొండల విహారయాత్రకు వెళ్లడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. పర్యాటకులు వారి వీలును బట్టి ఈ ప్రాంతాల నుండి బోటింగ్ ట్రిప్ ప్లాన్‌ చేసేకోవచ్చు.

  • రాజమండ్రి నుండి పురుషోత్తపట్నం లేదా పోలవరం బోట్ పాయింట్‌కు చేరుకుని, అక్కడ నుండి లగ్జరీ క్రూయిజ్ లేదా లాంచీల ద్వారా ప్రయాణం ప్రారంభించవచ్చు.

-శ్రీరాముడి దివ్య క్షేత్రాన్ని దర్శించుకున్న తర్వాత, భద్రాచలం సమీపంలోని కూనవరం లేదా పోచవరం బోట్ పాయింట్ నుండి పాపి కొండల వైపు పయనించవచ్చు.

boat tour | గోదావరి నదిలో బోటింగ్.. ఒక మరపురాని అనుభూతి!

boat tour

ఈ ట్రిప్‌లో అత్యంత ఆకర్షణీయమైన భాగం గోదావరి నదిపై బోట్ జర్నీ. ఉదయాన్నే చల్లటి గాలుల మధ్య లాంచీ ప్రయాణం మొదలవుతుంది. నది ఇరువైపులా ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు చూస్తుంటే ఏదో సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు అనిపిస్తుంది.

కొండల మధ్య గుండా బోట్ వెళ్తున్నప్పుడు, నది వెడల్పు తగ్గి కొండలు మనకు చాలా దగ్గరగా వస్తున్నట్లు అనిపిస్తాయి. ఈ వ్యూ చూసేందుకు రెండు కళ్ళు చాలవనుకోండి.

boat tour | వేసవిలో చల్లటి స్వాగతం

boat tour

సాధారణంగా ఎండలు ఎక్కువగా ఉన్నప్పటికీ, పాపి కొండల మధ్య గోదావరి నదిలో ప్రయాణిస్తున్నప్పుడు వీచే చల్లటి గాలులు శరీరానికి, మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. నగర ఉరుకుల పరుగుల జీవితానికి, కాలుష్యానికి దూరంగా ప్రకృతి ఒడిలో కాసేపు సమయాన్ని గడపడానికి ఇది బెస్ట్ స్పాట్.

బోట్ ప్రయాణం, ప్యాకేజీ ధరలు..
పాపికొండలు వెళ్లడానికి విడిగా బోట్లను అద్దెకు తీసుకోవడం కంటే టూరిజం ఆపరేటర్లు నిర్వహించే డే ప్యాకేజీలు లేదా నైట్ స్టే ప్యాకేజీలు బుక్ చేసుకోవడం సులభం, బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇవి సాధారణంగా రాజమండ్రి లేదా భద్రాచలం (పోచవరం) నుండి ప్రారంభమవుతాయి.

డే బోట్ టూర్ (నైట్ స్టే లేకుండా)..
ఒకరికి సుమారుగా రూ. 1,200 నుంచి రూ.1,350 (పెద్దలకు).. పిల్లలకు రూ. 1,000 నుండి రూ. 1,050 వరకు ఉంటుంది. ఈ ధరలోనే బోట్ ప్రయాణంతో పాటు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం వెజిటేరియన్ లంచ్, సాయంత్రం స్నాక్స్ , టీ ఇస్తారు. బోట్‌లో కల్చరల్ డాన్స్ (ధింసా), మ్యూజిక్ సిస్టమ్ ఉంటాయి.

చూసే స్థలాలు: పోలవరం ప్రాజెక్ట్ వ్యూ, గండి పోచమ్మ టెంపుల్, పేరంటాలపల్లి ఆశ్రమం/శివాలయం.

నైట్ క్యాంపింగ్..
మీకు సమయం ఉంటే, పాపి కొండల సమీపంలోని కొల్లేరు ఐలాండ్స్ వద్ద ఉన్న వెదురు గుడిసెలలో నైట్ స్టే చేయవచ్చు. రాత్రి వేళ నది ఒడ్డున క్యాంప్ ఫైర్ వేసుకుని, నక్షత్రాల ఆకాశం కింద గడపడం ఒక లైఫ్ టైమ్ ఎక్స్ పీరియన్స్ అని చెప్పవచ్చు.

నైట్ స్టే వివరాలు…
పాపికొండలు దగ్గర నైట్ స్టే చేయాలనుకుంటే నది ఒడ్డున, కొండల మధ్య ఉండే ట్రైబల్ విలేజెస్ దగ్గర వెదురు ఇళ్లు లేదా టెంట్లు అందుబాటులో ఉంటాయి. ప్రధానంగా సిరివాక , కొల్లూరు , శివగిరి క్యాంప్ సైట్లలో రిసార్ట్స్ ఉన్నాయి. క్యాంపింగ్ టెంట్లు / వెదురు ఇళ్లు ఒకరికి రూ. 3,000 నుండి రూ. 4,500 వరకు ఉంటుంది. లగ్జరీ ఏసీ కాటేజీలలో జంటగా లేదా ఒక రూమ్‌కి రూ. 5,500 నుండి రూ. 6,000 వరకు ఉంటుంది.

boat tour | నైట్ స్టే ప్యాకేజీలో లభించేవి:

  • మొదటి, రెండో రోజు బోట్ ప్రయాణం.
  • క్యాంప్ సైట్ వద్ద రాత్రి పూట నాన్-వెజ్/వెజ్ డిన్నర్ , కాంప్‌ఫైర్.
  • రెండో రోజు ఉదయం గైడ్‌తో కలిసి అడవిలో ట్రెకింగ్.

boat tour | ముందుగా బుకింగ్‌ బెస్ట్‌..

boat tour

నైట్ స్టే కాటేజీలు పరిమితంగా ఉంటాయి కాబట్టి ఏపీ టూరిజం అధికారిక వెబ్‌సైట్ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ టూర్ ఆపరేటర్ల ద్వారా ముందే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం మంచిది. మీరు బోట్ ఎక్కిన తర్వాత, రిసార్ట్స్ ఉండే కొండల ప్రాంతంలో మొబైల్ సిగ్నల్స్ అస్సలు ఉండవు.
బోట్ జర్నీ , పోలీస్ చెకింగ్ కోసం ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేదా ఐడీ ప్రూఫ్ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.

ప్రకృతిని ప్రేమిస్తూ, ఫోటోగ్రఫీపై ఇష్టం ఉన్నవారికి పాపి కొండలు ఒక పారడైజ్. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ వీకెండ్ లేదా రాబోయే సెలవుల్లో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో కలిసి గోదావరి ఒడిలోని ‘పాపి కొండల’ అందాలను వీక్షించడానికి ప్లాన్ చేసుకోండి!

బోటింగ్ బుకింగ్స్ కోసం ఎల్లప్పుడూ ప్రభుత్వం గుర్తించిన (ఏపీ టూరీజం) లేదా నమ్మకమైన ప్రైవేట్ టూర్ ఆపరేటర్లను సంప్రదించడం మంచిది. లైఫ్ జాకెట్స్ తప్పనిసరిగా ధరించండి. భద్రమైన ప్రయాణంతో ప్రకృతిని ఆస్వాదించండి.

CLICK HERE TO READ మీ ఫోన్‌ మీ మాటలు వింటోందా..? యాడ్స్ వెనుక అసలు టెక్నాలజీ ఇదే!

CLICK HERE TO READ MORE

Leave a Reply