బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
పెద్దపల్లి, ఆంధ్రప్రభ: కన్నేపల్లి పంప్ హౌస్ వద్దకు వెళ్లకుండా భారత రాష్ట్ర సమితి నాయకులను పెద్దపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం బిఆర్ఎస్ నాయకులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కన్నేపల్లి వద్ద ప్రతినిత్యం లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతుందన్నారు. ప్రభుత్వం చేతకానితనం వల్ల నీరు వృధాగా పోయి ఎల్లంపల్లి, లోయర్ మానేరు డ్యామ్ తో పాటు ఇతర డ్యామ్ లన్నీ డెడ్. స్టోరేజ్ కి వెళ్ళాయన్నారు. అరెస్టులతో కన్నేపల్లి పంప్ హౌస్ సందర్శనను అడ్డుకోలేరన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని రాబోయే కాలంలో తగిన గుణపాఠం చెబుతారనన్నారు. పోలీసులు అరెస్టు చేసినవారిలో మాజీ కౌన్సిలర్ పెంచాలా శ్రీధర్, మొబిన్, ప్రశాంత్, రేవల్లి. స్వామి, వెన్నం రవి, దిల్లు తో పాటు పలువురున్నారు.
