South Hyderabad | అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షం !!
South Hyderabad | అలర్ట్.. ఈ ప్రాతాల్లో భారీ వర్షం !!
- అప్రమత్తంగా ఉండాలని సూచన..
దక్షిణ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగర దక్షిణ భాగంలోని రాజేంద్రనగర్, ఫలక్‌నుమా, గోల్కొండ, ఆసిఫ్‌నగర్, నాంపల్లి, చార్మినార్, మలక్‌పేట్, బేగంబజార్, సైదాబాద్, సంతోష్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.
భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఉద్యోగాలు ముగించుకుని ఇళ్లకు వెళ్లే ప్రయాణికులు ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని, వర్ష ప్రభావిత ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
లో తట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే అవకాశం ఉండటంతో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అలాగే రహదారులపై ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉన్నందున వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు.
