Monsoon | ఐఎండీ నుంచి కీలక హెచ్చరిక

Monsoon | ఐఎండీ నుంచి కీలక హెచ్చరిక

ప్చ్… ఈసారి వానలు తక్కువేనా?

Monsoon |ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌ : ఎండాలతో సతమతవుతున్నప్రజలకు భారత వాతవరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. రుతుపవనాల రాక ఆలస్యంగామవుతుందని ఇప్పటికే వెల్లడించిన ఐఎండీ, రానున్న వానకాలంలో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. అయితే దీనికి ఎల్ నినో ప్రభావం కారణమని వెల్లడించారు. గత మూడు ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ సీజన్‌లో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డీజీఎం డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర పేర్కొన్నారు.

అసలు ఎల్‌ నినో అంటే ఏంటి?
‘ఎల్ నినో’ అంటే పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడం. సముద్రంలో జరిగే ఈ మార్పు వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణం తారుమారవుతుంది. దీనివల్ల వచ్చే రుతుపవనాలు బలహీనపడి, వర్షాలు చాలా తగ్గిపోతాయి. సాధారణం కంటే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయి, తీవ్రమైన వడగాల్పులు వీస్తాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎల్ నినో వస్తే ఎండలు ఎక్కువ – వర్షాలు తక్కువ (కరువు) అన్నమాట.

ఎల్ నినో జూన్ ప్రారంభంలో ప్రవేశించి, జూలై-ఆగస్టు నెలల వరకు క్రమంగా బలపడుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. అయితే సెప్టెంబర్ నెలలో దీని ప్రభావం అత్యధిక స్థాయికి (పీక్‌కు) చేరుకుంటుందని మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు.

ఈ వాతావరణ మార్పులు వ్యవసాయం, నీటి వనరులపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. అలాగే ఈ ప్రభావం వల్ల భవిష్యత్తులో తరచూ హీట్ వేవ్స్ (వడగాల్పులు) వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Leave a Reply