లోయర్ మానేరు జలాశయం 4 గేట్లు ఎత్తిన అధికారులు

లోయర్ మానేరు జలాశయం 4 గేట్లు ఎత్తిన అధికారులు
ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్ర ప్రభ : లోయర్ మానేరు జలాశయాని(Lower Maneru Reservoir)కి ఎగువ నుంచి భారీగా నీరు(Water) వస్తుండడంతో నాలుగు గేట్లు ఎత్తి 16 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
కాకతీయ కాలువ(Kakatiya Canal) ద్వారా 4 వేల క్యూసెక్కుల(Kyūsekkula) నీటిని దిగువ ఆయకట్టుకు విడుదల చేశారు. మధ్య మానేరు జలాశయం(Maneru Dam) నుంచి 8వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా కాలువ ద్వారా 7500 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 4 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతుండగా ఇన్ఫ్లో బట్టి తదుపరి నిర్ణయాన్నితీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
