ఇకనుంచి మన రాజధాని అమరావతి..

ఇకనుంచి మన రాజధాని అమరావతి..

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం చారిత్రాత్మకం

రాప్తాడు, ఆంధ్రప్రభ : అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తింపు ఇవ్వాలని రాష్ట్ర విభజన జరిగినప్పటినుండి చేసిన ప్రయత్నాలు ఫలించి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడం చారిత్రాత్మకమని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గర్వించదగ్గ విషయమని మరూరు సొసైటీ చైర్మన్ గోపాల్ నాయుడు పేర్కొన్నారు. రాప్తాడు మండలంలో టిడిపి నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు.

ఈ సంధర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని నిర్ణయానికి సహకరించిన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అమరావతిని రాజధానిగా నిలబెట్టేందుకు అహర్నిశలు కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పమే ఈ విజయానికి కారణమని ఈ బిల్లు తీసుకురావడంలో కీలక పాత్ర వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో ఇది ఒక చారిత్రాత్మక అధ్యాయమని ఇకపై ఎవరూ రాష్ట్ర రాజధాని అమరావతిని కదిలించలేరన్నారు. ఇకనుంచి ఆంధ్ర రాజధాని అమరావతి అని ప్రజలు గుర్తిస్తారని తెలియజేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ పంపు కొండప్ప క్లస్టర్ ఇంచార్జిలు సిసి రాము సోమర నారాయణ స్వామి మాజీ సర్పంచులు గాండ్లపర్తి నరేష్ సాకే తిరుపాల్ మాజీ కన్వీనర్ యర్రగుంట నారాయణస్వామి గంగలకుంట రమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply