వ్యవసాయ యాంత్రికరణ పరికరాల కోసం దరఖాస్తులు చేసుకోండి

వ్యవసాయ యాంత్రికరణ పరికరాల కోసం దరఖాస్తులు చేసుకోండి

  • ఏడిఏ సత్యనారాయణ

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : రైతులకు ఆదుకోవాలని ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సబ్సిడీతో వ్యవసాయ యాంత్రికరణ పరికరాలు సరఫరా చేస్తున్నదని, అర్హులైన రైతులు వ్యక్తిగతంగా వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల కోసం, దరఖాస్తులు చేసుకోవాలని ఉరవకొండ వ్యవసాయ సహాయ సంచా లకులు సత్యనారాయణ తెలిపారు. ఈనెల 15వ తేదీలోగా ఈ ప్రత్యేక వెబ్ అప్లికేషన్ నుండి ఆన్లైన్లో దరఖాస్తును
http://eseed.ap.gov.in/FM/ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. భూమిని కలిగి ఉన్న రైతులు, ఆర్వో ఎఫ్ ఆర్ రైతులు గత మూడు సంవత్సరాలలో కనీసం మూడు పంటల సీజన్లలో ఈ పంట అప్లికేషన్ లో బుక్ చేసిన, సిసి ఆర్ సి హోల్డింగ్ రైతులు అర్హులు 2024-25 లో సబ్సిడీ పొందిన లబ్ధిదారులు అర్హులు కారు.

కుటుంబంలో ఒక సభ్యుడు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు తెలిపారు. రైతులు అవసరమైన వ్యవసాయ యంత్రాలు మరియు పరికరాల కోసం ఆన్లైన్ ప్లాట్ఫారం ద్వారా స్వతంత్రంగా లేదా గ్రామాలలో ఉన్న రైతు సేవా కేంద్రాలలో, రైతు సేవా కేంద్ర సిబ్బంది సహాయంతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్న కారు, మహిళల రైతుల కు యంత్రాల యూనిట్ ధరలో 50 శాతం మరియు ఇతర రైతులకు 40 శాతం రాయితీ ఇస్తారన్నారు. ట్రాక్టర్ పని ముట్లు విత్తడం నాటడం త్రవ్వే
యంత్రాలు, స్ప్రేయర్లు స్వీయ చోదక ఇంప్లిమెంట్స్, ట్రాక్టర్లు 40 హెచ్ పి అండ్ మినీ ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, హార్వెస్టింగ్, నూర్పిడి యంత్రాలు, పంట తర్వాత, విలువ జోడింపు యంత్రాలు, అవశేష నిర్వహణ ఎండు గడ్డి మరియు మేత సామాగ్రి సబ్సిడీ యేతర చెల్లింపు పద్ధతి ప్రొసీడింగ్ల అందిన 15 రోజు లోపల ఎంపిక చేసుకున్న డీలర్లకు వెబ్ అప్లికేషన్ లోని పేమెంట్ గేటు ద్వారా రైతు వాటా చెల్లించాలన్నారు.

డీలర్ల ద్వారా పరికరాల డెలివరీ కొనుగోలు ఆర్డర్ అందిన తర్వాత డీలర్ వ్యవసాయ యంత్రాలు లేదా పరికరాలను 15 రోజుల్లోపు సరఫరా చేయాలన్నారు. డెలివరీ సమయంలో మండల వ్యవసాయ అధికారులు తనిఖీ చేయాలి మరియు మొబైల్ అప్లికేషన్ ద్వారా తనిఖీ నిర్వహించిన, యంత్ర పరికరాలకు సరఫరాకు ధ్రువీకరణ చేయాలన్నారు. గుంతకల్లు మండలానికి 35.88 లక్షలు, ఉరవకొండ మండలానికి 42.40 లక్షలు, వజ్రకరూర్ మండలానికి 48.49 లక్షలు, విడపనకల్లు మండలానికి 32.03 లక్షలు రూపాయలు, ఉరవకొండ వ్యవసాయ డివిజన్ కి 158.79 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Leave a Reply