సాయిగూడెం నూతన పంచాయతీ కార్యదర్శికి సన్మానం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని సాయిగూడెం గ్రామానికి నూతన గ్రామపంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన గ్యార విజయకుమార్ కు బీఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో స్వాగతపూర్వక సన్మానం జరిగింది. శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి నూతన కార్యదర్శికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధి కృషిలో ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని నూతన కార్యదర్శి కోరారు.

కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు గంగధారి సుధీర్ కుమార్, బీజని బాల్‌రాజ్, ఉదరి రాములు, బండి శ్రీనివాస్ ఇంజరాజు, కొండ చంద్రారెడ్డి, అంజద్, గోపు మహేందర్‌రెడ్డి, ముద్దేపాక లక్ష్మయ్య, ముద్దేపాక నరసయ్య, బొప్పాపురం వెంకటేష్, ముద్దేపాక నరేందర్, మక్బూల్, బొడ్డు మహేందర్, పిల్లిట్ల శేషాద్రి, కుండే మల్లేష్, ఆలేటి నరసయ్య, అల్వాల శాంతికుమార్, ఆలేటి కర్ణాకర్, బోగారం మురళి, మైల శ్రావణ్ కుమార్, గంగాధరి ఉప్పలయ్య, స్థానికులు పాల్గొన్నారు.

Leave a Reply