బిజెపి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి..
బిజెపి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి..
- డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి
- 15వ వార్డులో విస్తృత ప్రచారం
పరకాల, ఆంధ్రప్రభ : భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని 15 వార్డు బిజెపి అభ్యర్థి కుక్కల విజయకుమార్ గెలుపు కోసం 15వ వార్డులోని కూరగాయల మార్కెట్ తదితర వీధుల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రచార లో భాగంగా ఇంటింటికి కరపత్రాలు పంచుతూ 15వ వార్డు బిజెపి అభ్యర్థి కుక్కల విజయకుమార్ ను అత్యధిక మెజార్టీతో ఓటర్లను కోరారు.
ఈ సందర్భంగా డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలే బిజెపి అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తాయన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో బిజెపి 15వ వార్డ్ అభ్యర్థి విజయ్ కుమార్, బీజేపీ నాయకులు కుక్కల శ్రీధర్, శంకర్, నాయకులు, నాయకురాళ్లు ఉన్నారు.
