Munugodu | పశువులకు గాలికుంటు టీకాలు
Munugodu | పశువులకు గాలికుంటు టీకాలు
Munugodu | మునుగోడు, ఆంధ్రప్రభ : పశుసంపదే రైతుల ఆర్థిక వెన్నెముక అన్న నినాదాన్ని కార్యరూపంలోకి తీసుకొస్తూ ఈరోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండలం బీరెల్లి గూడెం గ్రామ పంచాయతీలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. గ్రామంలో ఎడ్లకు, పశువులకు గాలికుంటు టీకాలు వేయడంతో పాటు గొర్రెలు,మేకలకు అవసరమైన మందులను పంపిణీ చేశారు. వెటర్నరీ డాక్టర్ వెంకన్న పర్యవేక్షణలో గ్రామ సర్పంచ్ దాసరి గోవర్ధన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పశుపాలక రైతులు భారీగా తరలివచ్చి సద్వినియోగం చేసుకున్నారు.పశువుల ఆరోగ్యంపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధుల ముప్పును దూరం చేయవచ్చని ఈ సందర్భంగా అధికారులు వివరించారు.
సర్పంచ్ దాసరి గోవర్ధన్ మాట్లాడుతూ పశుసంపద ఆరోగ్య పరిరక్షణకు గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రైతులకు భరోసా కలిగించేలా చేపట్టిన ఈ కార్యక్రమం గ్రామంలో ప్రశంసలు అందుకుంది.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దోటి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సత్యనారాయణ, వార్డు సభ్యులు మహారాజు, మల్లేష్, మాజీ గొర్ల చైర్మన్ శేఖర్, గ్రామ పెద్దలు దాసరి రాములు, దోటి శ్రీనివాస్, బొల్లం జంగయ్య, మల్లయ్య, వీరమల్లు తదితరులు తదితరులు పాల్గొన్నారు.
