దుబ్బా వీరలక్ష్మికి నివాళులర్పించిన ఆర్య వైశ్య మహాసభ నేతలు
దుబ్బా వీరలక్ష్మికి నివాళులర్పించిన ఆర్య వైశ్య మహాసభ నేతలు
దశదిన కర్మ కార్యక్రమానికి హాజరైన అమరావాది లక్ష్మీనారాయణ
దుబ్బా శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
ఆర్య వైశ్య మహాసభ నాయకుల నివాళులు
దివంగత వీరలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన
వరంగల్, ఆంధ్రప్రభ: వరంగల్ జిల్లా ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్ మాతృమూర్తి, దివంగత శ్రీమతి దుబ్బా వీరలక్ష్మి దశదిన కర్మ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు అమరావాది లక్ష్మీనారాయణ హాజరై నివాళులర్పించారు.

ఈ సందర్భంగా దుబ్బా శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యుల తీరని దుఃఖంలో తాము భాగస్వాములమని పేర్కొంటూ మనోధైర్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి రేణుకుంట్ల గణేష్ గుప్త, చింతల రవికుమార్ గుప్త, ఉరే లక్ష్మణ్, వంగేటి అశోక్, పశుపతి తదితర జిల్లా నాయకులు, ఆర్య వైశ్య మహాసభ పెద్దలు పాల్గొన్నారు.
దివంగత శ్రీమతి దుబ్బా వీరలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని ఆర్య వైశ్య మహాసభ నాయకులు ప్రార్థించారు.
