ఘనంగా బెజ్జంకి లక్ష్మి నర్సింహాస్వామి శకటోత్సవం

బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు శఖటోత్సవం ఘనంగా నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ ఉత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవం సందర్భంగా గుట్ట చుట్టూ ఎడ్ల బండ్లు, వాహనాలతో ప్రదక్షిణలు వైభవంగా సాగాయి. మేకల బండి ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది. భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని ఉత్సవాన్ని మరింత ఆధ్యాత్మికంగా మార్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ ఉత్సవం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply